తెదేపా గూటికి చేరిన వరద

    తెదేపా గూటికి చేరిన వరద

    ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజులురెడ్డి ఆఖరికి తెదేపా గూటికి చేరారు. బుధవారం ప్రొద్దుటూరులో తెదేపా నాయకులతో కలిసి విలేఖరుల సమావేశంలో వరద పాల్గొన్నారు. సుదీర్ఘమైన రాజకీయానుభవం కలిగిన వరద సీఎం రమేష్ సమక్షంలో తెదేపా సమావేశంలో పాల్గొనడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. కనీసం చంద్రబాబు సమక్షంలో తెదేపా గూటికి చేరాల్సిన వరద సాదాసీదాగా పోట్లదుర్తికి చెందిన రమేష్ సమక్షంలో ఆ పార్టీకి జై కొట్టడం ఆయన అభిమానులకు ఇబ్బందిగా మారింది.

    చదవండి :  జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త పాలకవర్గం

    ఈ సందర్భంగా పట్టణంలోని బద్వేలు శ్రీనివాసులురెడ్డి ఇంట్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో రమేష్ మాట్లాడుతూ…

    ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజులురెడ్డి నైతిక విలువలున్న నేత. మంచి అనుభవశీలి. సమర్థవంతంగా రాజకీయాలను నడిపే శక్తి ఆయనకుందని సీఎం రమేష్ పేర్కొన్నారు. ఇలాంటివారి సేవలు రాష్ట్రానికి, తెదేపాకు అవసరమని భావించి పార్టీలోకి ఆహ్వానించాం.

    ప్రొద్దుటూరు వ్యాపార, వాణిజ్యకేంద్రంగా ఖ్యాతి పొందింది. ఈ ప్రాంత ప్రగతికి మేం పెద్దపీట వేస్తాం. రౌడీయిజం, గుండాగిరి పాలన లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించే బాధ్యత మాపైఉందన్నారు. పట్టణంలో మంచినీటి ఎద్దడి రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ప్రజాసేవ చేసే అభ్యర్థులకే ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

    చదవండి :  జమ్మలమడుగు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    పురపాలిక, సార్వత్రిక, మండల, జడ్పీ ఎన్నికల్లో లింగారెడ్డి, వరదరాజులురెడ్డి వర్గం కలిసిమెలసి పనిచేస్తుందన్నారు.

    మొత్తానికి ఐదు పర్యాయాల తర్వాత ప్రొద్దుటూరులో ఓటమి పాలైన వరదరాజుల రెడ్డి గడచిన ఐదు సంవత్సరాలలో బాగానే పార్టీలు మారారు – కాంగ్రెస్ నుండి వైకాపా అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్ అక్కడి నుండి ఇప్పుడు తెదేపాకు. రాజకీయ ప్రయాణాలు ఇలాగే ఉంటాయేమో!

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *