కడప నగరంలో పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని సిటీ బస్సులు నడపాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నిర్మల అన్నారు. శుక్రవారం నగరం, పురపాలక సంస్థ కమిషనర్లు, అర్టీసీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు పురపాలకలో కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అందుకు పురపాలక సంస్థల అధికారులు సహకరించాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, భూసేకరణ, రోడ్లు వెడల్పు, ఆక్రమణలు, తదితరాలపై సమీక్షించడం జరుగుతుందన్నారు.
మైదుకూరు పురపాలకకు కంపోస్టు యార్డు, కార్యాలయాలం, గ్రంథాలయానికి స్థలం కావాలని సంబంధిత అధికారి కోరారు. స్పందించిన ఆమె పరిశీలించాలని మండలాధికారికి సూచించారు.
యర్రగుంట్ల బస్సు నిలుపు స్థలం వద్ద పురపాలక కార్యాలయానికి మార్కింగ్ వేయించాలని ఆదేశించారు. కడపలో తాగునీటి ఎద్దడిలేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.