
ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు తెచ్చిన సంబళ మెల్లఁ దీరుఁబో లోలోనె ॥చ1॥ దప్పముచెడినవాని తరుణి కాఁగిటఁ జేరి అప్పటప్పటికి నుస్సు రనినయట్టు వొప్పయిన హరిభక్తి వొల్లనివాని యింటి- కుప్పలైన సంపదలు కుళ్లుఁబో లోలోనె ॥చ2॥ ఆఁకలి చెడినవాని అన్నము కంచములోన వోఁకిలింపుచు నేల నొలికినట్టు తేఁకువైన హరిభక్తి తెరువుగానని వాని- వేఁకపు సిరులు కొంపవెళ్లుఁబో లోలోనె ॥చ3॥ వొడలుమాసినవాని వొనరుఁజుట్టములెల్ల బడిబడినే వుండి పాసినయట్టు యెడయక తిరువేంకటేశుఁ దలఁచనివాని- ఆడరుబుద్ధులు పగలౌఁబో లోలోననె |
రాగము: శ్రీరాగం రేకు: 0039-04 సంపుటము: 1-240 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం