ఆదివారం , 22 డిసెంబర్ 2024

ప్రొద్దుటూరులో తమిళనాడు గవర్నర్

ప్రొద్దుటూరు: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి చేయించిన వజ్రకిరీట సంప్రోక్షణ కార్యక్రమంలో శుక్తరవారం తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. 10.50 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రొద్దుటూరు చేరుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు ఆయనకు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.

అక్కడినుంచి ఆయన ప్రత్యేక వాహనంలో ఆర్ అండ్ బీకి చేరుకున్నారు. అక్కడ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సీ.రామచంద్రయ్య తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన అమ్మవారిశాలకుచేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు.

చదవండి :  కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

అనంతరం పెన్నాతీరంలో ఉన్న అమృతేశ్వరాలయానికి వెళ్లారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత ఆయన పలు ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గోన్నారు. మద్యాహ్నం ఆర్ అండ్ బీ అతధి భవనానికి చేరుకుని భోజనం చేసి, విరామం అనంతరం తిరిగి తమిళనాడుకు తిరిగి వెళ్లారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: