24 నుంచి అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు

    24 నుంచి అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు

    పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుని 605వ జయంత్యుత్సవాలకు తి.తి.దే బుధవారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జి డెరైక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఆఫీసర్ టీఏపీ నారాయణ తాళ్లపాకలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 26 వరకు జయంత్యుత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

    అన్నమాచార్యుడు
    అన్నమాచార్యుడు

    అన్నమయ్య జన్మస్ధలం అయిన తాళ్లపాకలోని ధ్యానమందిరంలో నాదస్వర సమ్మేళనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామోత్సవం, సప్తగిరి గోష్టిగానం, శ్రీవారి కల్యాణం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

    చదవండి :  నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు... పోలీసు బలగాల పహారా

    శ్రీనివాసుని కల్యాణోత్సవం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సప్తగిరి గోష్టిగానంతోపాటు ఊంజలసేవ ఉంటాయన్నారు.

    ఇక్కడే ఉత్సవాలు నిర్వహించాలి: తాళ్లపాక గ్రామస్తులు

    టీటీడీ అధికారులు అన్నమాచార్య ధ్యానమందిరంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తాళ్లపాకను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ టీటీడీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాలను ఇక్కడే నిర్వహించాలని, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్దకాదని స్పష్టంచేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తాళ్లపాకలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జి నారాయణ గ్రామస్తులకు వివరించారు.

    చదవండి :  16 వ తేదీ నుండి 18 వరకు దొమ్మర నంద్యాలలో జ్యోతి ఉత్సవాలు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *