15 సంవత్సరాల కల సాకారమైంది !

పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల విడుదల

శభాష్, 15 సంవత్సరాల కల నెరవేరిన రోజు,పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిసామర్ధ్యం 44,000 క్యూసెక్కుల నీటిని విదుదల చేశారు.

2004 లో YSR 11,000 క్యూసెక్కుల సామర్ధ్యమున్న పోతిరెడ్డిపాడులో రెండవ రెగ్యులటర్ కట్టి 44,000 క్యూసెక్కులకు పెంచారు.

15 సంవత్సరాల కలపోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని నిరశిస్తు దేవినేని ఉమా నాయకత్వంలో ప్రకాశం బ్యారేజి కింద టెంట్లు వేసి మూడు రోజులపాటు ధర్నా చేశారు.ఒక్క బక్కెట్ నీళ్ళను తీసుకెళ్ళినా రక్తం చిందిస్తాం అని దేవినేని ఉమా హెచ్చరిక చేశారు.

చదవండి :  ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

మొన్నటివరకు నీటిపారుదల మంత్రిగా పనిచేసిన ఈ దేవినేని ఉమానే రాయలసీమకు 100 TMCల నీటిని ఇచ్చాం, కడపకు నీళ్ళు ఇచ్చాం, పులివెందులకు ఇచ్చాం అని గత 5 సంవత్సరాలు హంగామా చేసింది.

YSR పోతిరెడ్డిపాడు discharge కెపాసిటీని 44,000 క్యుసెక్కులకు పెంచకుండా ఉండివుంటే గండికోట లేదు ,పైడిపాలెం లేదు , అసలు సీమకు సరిపడ నీళ్ళే దక్కేవి కాదు.YSR పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచకపోయి ఉంటే బాబుగారి కరకట్ట ఇళ్ళు వొరద వొచ్చిన రెండవరోజే మునిగిపోయేది.

చదవండి :  దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్

నీళ్ళు పారవలసింది పేపర్ల మీద కాదు ,కాలువల్లో పారి పంట పొలాలకు చేరాలి. అప్పుడే రైతుకు సంతృప్తి.ఆ సంతృప్తే ఓటు రూపంలో కృతజ్ఞతగా మారుతుంది.ప్రచార ఆర్భాటంతో లేని నీళ్ళతో పంటలు పండవు.

పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిలో తెలుగు గంగ కు 17,000 క్యుసెక్కులు, 14,000 క్యుసెక్కులు,నిప్పుల వాగు ఎస్కేప్ చానల్కు 13,000 క్యుసెక్కుల నీరు విదుదలచేస్తున్నారు.ప్రతి కాలువలో సంవృద్ధిగా నీళ్ళు వున్నాయి.అటు హంద్రి-నీవా కూడ పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తుంది.

చదవండి :  మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి

అధికారులు,స్థానిక రాజకీయ నాయకులు కాలువలకు గండ్లు పడకుండా ,నీరు వృధా కాకుండ జాగర్తలు తీసుకోవాలి. కాలువలు బలహీనంగా ఉన్నచోట ఇసుక బస్తాలను సిద్దంగా ఉంచుకోవాలి.

– శివ రాచర్ల

ఇదీ చదవండి!

రచ్చబండ గురించి సెప్టెంబర్ 1న ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి భాస్కరశర్మలతో మాట్లాడుతున్న వైఎస్

వైఎస్ అంతిమ క్షణాలు…

రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: