గురువారం , 21 నవంబర్ 2024
వైకాపా-లోక్‌సభ

సదువుకుంటే వైకాపాకు ఓటేయొద్దా!

ఎన్నికల పోరు సమీపిస్తున్న సందర్భంలో రాజకీయాలపై, పరిణామాలపై ఆసక్తి కాస్త అధికంగానే ఉంటుంది. టీ టైములో లేదా భోజన సమయంలో కలిసినప్పుడు సహోద్యోగుల మధ్య రాజకీయ చర్చలు నడవటం సర్వసాధారణం. ఈ చర్చలలో ఒక్కొక్కరివి ఒక్కో అంచనాలు. ఒక్కొక్కరివి ఒక్కో రకమైన అభిప్రాయాలు. ఈ మధ్య కాలంలో ఒక వింతైన, గమ్మత్తైన వాదన ఒకటి మేధావులుగా  చలామణీ అవుతున్న ఒక వర్గం నోట   తరచూ  వినిపిస్తోంది  – అదేమంటే  ‘సదువుకున్న వాళ్ళెవరైనా వైకాపాకు ఓటేస్తారా?’ అని.

ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అంటున్నారు ‘నువ్వు సదువుకున్నావా? లేదా?’ అని. వీళ్ళ మాటలు విన్న నాకైతే ‘నేనేమైనా తప్పు చేస్తున్నానా’ అనిపించింది – ఒకటి రెండు సార్లు.  ఆ మధ్య ఒక ఆదివారం టెక్సాస్ (అమెరికా) లో ఉన్న మిత్రుడు అంజిరెడ్డి ఫోన్ చేసి ఇదే విషయమై వాపోయాడు – జగన్ పేరు చెబితే కొందరు ఇలా తీసిపారేస్తున్నారని.  సరే ఒకసారి ఉండబట్టలేక ఒకాయనను అడిగాను – ‘ఏమండీ! సదువుకుంటే వైకాపాకు ఎందుకు ఓటేయొద్దండీ!’ అని.

అందుకాయన అన్నాడు – ‘ఏమిటండీ మీకు తెలీదా ఆ పార్టీ అధినేత ఎంతటి అవినీతిపరుడో’ అని. నేనైతే ‘తెలీదండీ. అయినా జగన్ అధికారంలో లేడు గదండీ. అధికారంలో లేనప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడిది’ అని. నేనీ మాట అనటంతోనే ఆయన సిబీఐ కేసులు గట్రా అంటూ మొదలెట్టారు. ‘ఏమండీ! అవన్నీ కోర్టు విచారణలో ఉన్నాయి కదా. విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయిగా. ఈ లోపే మనం ఒక అభిప్రాయానికి రావడం కరక్టు కాదేమో!’ అని. ‘అందుకేనండీ మిమ్మల్ని అన్నది సదువుకున్నారా? లేదా? అని’ అంటూ ముక్తాయించారు.

చదవండి :  జిల్లా పేరు మార్చాలని తెదేపా తీర్మానం

మరుసటి రోజు కాఫీ సమయంలో ముందటి రోజు నా సదువును గూర్చి నాకే సందేహాన్ని లేవనెత్తిన మిత్రుడు మళ్ళీ తారసపడ్డాడు. ఈ సారి ఆయనే చెప్పుకొచ్చారు – ‘ఏమండీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు గారైతే సీమాంధ్రను బాగా అభివృద్ది చేస్తారండీ’ అని. ‘చెయ్యొచ్చేమో’ అన్నాను. ‘కానీ అలా చేస్తారని చెయ్యగలరని మీరెలా హామీ ఇవ్వగలరు?’ అని అడిగితే ‘హైదరాబాదు చేశాడు గదా!’ అన్నారు.

హైదరాబాదు చేస్తే ఇప్పుడు కొత్త రాజధానిని సైతం అలానే చేస్తాడని రూలుందా? ఒకవేళ ఉంటే .. హైదరాబాదులో హైటెక్ సిటీ పేరు చెప్పి చుట్టూతా భూములన్నీ ముందే తక్కువ ధరకు బాబు గారు వారి అనుచరులూ కొన్నారుట కదా! ఇప్పుడు కొత్త రాజధాని విషయంలో అలానే చేస్తే ! హైదరాబాదు నగరం నడిబొడ్డున అప్పనంగా వందలాది ఎకరాలను ఊరూ పేరూ లేని సంస్థలకు కట్టబెట్టినట్లు చాలా రాజకీయ పార్టీలే గగ్గోలు పెడుతున్నాయి కదా! హైదరాబాదుకి పరిమితమై మిగతా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని వైకాపా వాళ్ళు చెబుతున్నారు. అంతమాత్రాన బాబుకు ఓటు వేయడం మానేయాలా ? అంతెందుకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ – ‘మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడవడా?’ అన్నారు – అలా అన్నారని ప్రజలు తెదేపాకు ఓట్లు వెయ్యటం మానేశారా? లేదే!

చదవండి :  తెదేపా ప్రలోభాల పర్వం

ఇక జగన్ కేసుల విషయానికొస్తే ఇప్పటివరకూ జగన్ ఎదుర్కొంటున్నవి ఆరోపణలు మాత్రమే! అవి ఇంకా కోర్టు విచారణలో ఉన్నాయి. కోర్టు విచారణలో ఆరోపణలు రుజువైతే అప్పుడు జగన్ అవినీతికి పాల్పడినట్లు లెక్క. ఒకవేళ అలా తేలి జగన్ శిక్షకు గురైతే అతడు ఎన్నికలకు అనర్హుడౌతాడు. ఇవేవీ తేలకుండానే వైకాపా అవినీతి పార్టీ – ఆ పార్టీకి   ఓటేయొద్దు అంటే ఎలా? నిన్న సీఎం రమేష్ సంభేపల్లిలో మాట్లాడుతూ జగన్ కు ఓటు వేస్తే అవినీతిని సమర్దించినట్లే అని సెలవిచ్చారు.  మరి చంద్రబాబుకు ఓటు వేస్తే వెన్నుపోటును సమర్దించినట్లా అంటే ఈయన మాట్లాడరు. జగన్ లేదా వైకాపా విధానాల గురించో విమర్శించవచ్చు. తప్పు లేదు.

చదవండి :  కడప కార్పోరేషన్ వైకాపా పరం

ఇంకా గొప్పగా చంద్రబాబును లేదా తెదేపాను కావాలంటే పొగుడుకోవచ్చు. అంతేకానీ జగన్ లేదా వైకాపాకు ఓటు వేసిన వాళ్ళు అవినీతి సమర్ధకులు లేదా తెలివి లేనోల్లు లేదా సదువుకున్నా మూర్ఖులు అని ప్రచారం చెయ్యటం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అయినా రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది – నాకు నచ్చినోల్లకు ఓటు వెయ్యటానికి – మీరు చెప్పినట్లు వెయ్యటానికి కాదు. మీకు నా ఓటు కావాలంటే నన్ను ఒప్పించండి లేదా మీ విధానాలు చెప్పి మెప్పించండి. అంతే కానీ మీ అభిప్రాయాలని నా పైన రుద్దొద్దు అని సవినయంగా నమస్కరిస్తూ!

– ఒక ఓటరు

ఇదీ చదవండి!

పదోతరగతి ఫలితాల్లో

ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!

కడప జిల్లా గురించి ఎవరూ ఏమీ అడక్కపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత రెండేళ్ళుగా చెప్తూనే వస్తున్నారు. ఆయన …

4 వ్యాఖ్యలు

  1. మన దేశం లో కోర్ట్ లో తీర్పు రావాలంటే పదుల సంవత్సరాలు పడుతుంది …. అంటే ఈ లోపు ఇలాంటి వారిని గెలిపిస్తూనే వుందాం. ఒక్క గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కేసు చాలు తండ్రి కొడుకులు తప్పు చేసారో లేదో చెప్పటానికి …కాని వీల్ల పేరు డైరెక్ట్ గ లేదు అనకండి ప్లీజ్….

  2. వీడు అధికారంలో లేనప్పుడే ఆడి బాబు ని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకం చాలు…, మళ్ళీ అమాయకంగా “అధికారంలో లేడు కదండీ..” సన్నాయి నొక్కులొకటి…, ఒక విషయం తెలుసుకోండి .. ఆడిని.., ఆడిని సపోర్ట్ చేసేవాళ్లని మనుషులుగా ట్రీట్ చెయ్యట్లా జనాలు.., పిచ్చి కుక్కలని తరిమికొట్టినట్టు కొట్టించుకోకుండా మనుషుల్లా ఆలోచించడం నేర్చుకోండి. జనాలు అన్నారంటే అనరా మరి…!!

  3. ఏమండి, మరచిపొయారా వీరివల్ల ఎంత మంది జైలు పాలయ్యారొ, ఎంతొ బవిష్యత్తు వున్న శ్రిలక్ష్మి IAS గారు, CBI JUDGE ఎమయ్యారొ, ఆలొచించండి అసలు నెరస్తులె తప్పించుకునె చట్టాలున్న ఈ దెశంలొ వీల్లకు BAIL కుడా దొరకలెదంటె ఎందుకొ ఆలొచించండి.

    • సాల్లెండీ .. బాగా చెప్పిండ్రు. నచ్చనప్పుడు ఏదో ఒకటి చెప్పి ఎవరినైనా ఇరికియ్యోచ్చు… కేసులలో. అభియోగాలు నమోదు చెయ్యటం ఎంత పనీ. కోర్టులను ఎలా మేనేజ్ చేయొచ్చో మన చంద్రబాబు గారినదిగితే బాగా చెప్తారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: