కడప: శ్రీదేవి భూదేవిలతో దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. స్వామి జన్మనక్షత్రం శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు.
వేదపండితులు మంత్రోచ్ఛారణల నడుమ కడపరాయని కల్యాణం కన్నుల పండువగా సాగింది. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారి కల్యాణం చూసి తరించినారు.
ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.