గురువారం , 21 నవంబర్ 2024

‘చంద్రబాబు మాట నిలుపుకోవాల’

ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కొనసాగుతున్న ఆందోళన

కడప: జిల్లాలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలుపుకోవాలని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఊరికోమాట, రోజుకో ప్రకటన ఇవ్వడం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టటానికే చేస్తున్నారని ఆరోపించారు. అధిక సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు, కవులు, సాహితీవేత్తలు ఉన్న ప్రాంతంలో కాకుండా కర్నూలులో విశ్వవిద్యాలయం స్థాపిస్తామని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు

గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉర్దూ విశ్వవిద్యాలయ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరగుతున్న నిరాహార దీక్షలకు మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్‌బాషా, వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు.

చదవండి :  ఉప ప్రచారానికి ప్రచారానికి ఎంపీ సబ్బం

విశ్వవిద్యాలయం సాధన కోసం ఏర్పాటైన యాక్షన్ కమిటీకి తమ మద్దతు ఉంటుందన్నారు. రోజుకోమాట చెప్పడంతో ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని, కొత్త సమస్యలు అనేకం పుట్టుకొస్తాయని యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలాఉద్దీన్ అన్నారు. ముందు ప్రకటించినట్లు కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయ సాధనకు తెదేపా నాయకులు, ప్రభుత్వం కృషిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉర్దూభాషాభిమానులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

అరటి పరిశోధనా కేంద్రం

పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: