విమానాశ్రయంలో జింకల మందలు

విమానాశ్రయంలో జింకల మందలు

కడప విమానాశ్రయంలో జింకల మందలు సంచరిస్తున్నాయని.. వాటిని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కడప డీఎఫ్‌వో నాగరాజు తెలిపారు. విమానాశ్రయం వద్ద మైదానం పెద్దగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయన్నారు.

కృష్ణజింకలు 10 నుంచి 15 వరకు మందలుగా వస్తాయని.. అలాంటి ఈ ప్రాంతంలో అయిదు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇటీవల ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు.

జింకలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని తమకు ఆదేశించారన్నారు. ఆదేశం మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నామని త్వరలో కలెక్టరుకు, కన్జర్వేటర్‌కు పంపుతామన్నారు. తదుపరి ఆదేశాల మేరకు జింకలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.

చదవండి :  14న కడప విమానాశ్రయం ప్రారంభం కానుందా?

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: