“స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం సీమ భవిష్యత్తును అంధకారంలోకి నేట్టేయడానికి కాంగిరేసు బరితెగించిన సందర్భమిది. తెలంగాణకు చెందిన కేంద్ర జలమండలి మాజీ సభ్యడు, నీటి పారుదల రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విభజన జరిగితే సీమ ఎదుర్కోనబోయే సంక్షోభాన్ని చూచాయగా వివరించారు. ఆయన చెప్పిన విషయాలు సీమ ఎడారిగా మారనుందనే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటికైనా కుహనా రాజకీయాలకు పాల్పడుతున్న సీమ కాంగ్రెస్ నాయకులు స్వప్రయోజనాల ‘రాయల తెలంగాణ’ పాటలను, హైదరాబాదు ఆందోళనలను పక్కన పెట్టి సీమ భవితవ్యం గురించి మాట్లాడకపోతే చరిత్ర హీనులుగా మారి భవిష్యత్తు తరాలను అంధకారంలోకి నెట్టినవారవుతారు. సీమలోని మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు ఈ దిశగా ఉద్యమాన్ని ఉరకల్లెత్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ”
విద్యాసాగర్ రావు చెప్పిన కొన్ని అంశాలు కడప.ఇన్ఫొ వీక్షకుల కోసం ….
నిజమే.తెలంగాణ ఏర్పాటు తర్వాత కృష్ణాజలాల వినియోగం మొత్తం కేంద్ర బోర్డు అజమాయిషీలోకి వెళుతుంది కాబట్టి.. రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలు మినహా అదనంగా మిగులు జలాల లభ్యత కూడా కష్టమే. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల తర్వాత ఎగువ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలు మిగులు జలాలను కిందకు వదులుతాయన్న గ్యారంటీ ఏమాత్రం లేదు. రాయలసీమ ప్రాంత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆంధ్రా వారిని సీమ ప్రజలు నమ్మరు. వీరిని వారు కూడా నమ్మరు. వారి మధ్య జల వివాదాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
సీమ నీటికరువుతో బాధ పడాల్సిందేనా?
మూడు పరిష్కారాలున్నాయి. రాష్ట్ర విభజన సమయంలోనే రాయలసీమకు కనీసం 120 నుంచి 130 టీఎంసీల నికర జలాలు ఇచ్చేలా చూడాలి. 75 టీఎంసీల వరకుకృష్ణా నికర జలాలను పునఃకేటాయించాలి. అందుకు ఆంధ్రా, తెలంగాణలు మానవతా దృక్పథంతో అంగీకరించి తమ వాటాను వదులుకోవడానికి సిద్ధపడాలి. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాల్వల్లో ఆంధ్రా ప్రజలు వినియోగం తగ్గించుకుంటే.. కనీసం 50 టీఎంసీల వరకు సీమకు ఇవ్వొచ్చు.
సాగర్ ఎడమ కాల్వలో వినియోగం తగ్గించుకుంటే మరో 25 టీఎంసీల వరకు ఇవ్వొచ్చు. అలాగే.. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రమే ప్యాకేజీలో భాగంగా తన ఆధ్వర్యంలో నిర్మించి 160 టీఎంసీల గోదావరి వరద జలాలను శ్రీశైలం దిగువన కృష్ణా బేసిన్‌కు తరలించాలి. అందులో ఆంధ్రా, తెలంగాణలకు కనీసం 90 టీఎంసీలు లభిస్తే.. మహారాష్ట్ర, కర్ణాటకలకు 70 టీఎంసీల వరకు వెళతాయి. అయినా పర్వాలేదు. ఆ మేరకు రాయలసీమకు మరో 50 టీఎంసీల వరకు లబ్ధి చేకూర్చవచ్చు. అయితే దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ నిర్మాణానికి ముందే గోదావరి నికర జలాల విషయంలో ఎలాంటి భంగం ఉండదంటూ తెలంగాణ ప్రాంత ప్రజలకు స్పష్టమైన హామీని కేంద్రం ఇవ్వాలి.
దుమ్ముగూడెం నీళ్లతో సాగర్ ఎడమ కాల్వ కింద మరికొంత కొత్త ఆయకట్టును ఇస్తామని తెలంగాణకు హామీ ఇవ్వాలి. ఇదంతా కూడా రాష్ట్ర విభజన సమయంలోనే జరగాలి. అలా జరగకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాయలసీమకు కృష్ణా నదీ జలాలు అదనంగా లభిస్తాయన్నది ఒక భ్రమే. మిగులు/వరద జలాలు కూడా కచ్చితంగా వస్తాయన్న గ్యారంటీ లేదు.
ఇది కూడా కాదంటే రాయలసీమ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి.. కృష్ణా మిగులు/వరద జలాలు లభ్యమైనప్పుడు దాచుకుని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అక్కడి ఖనిజ సంపదతో దుబాయ్‌లాగా సీమను అభివృద్ధి చేసుకోవాలి. ఇంతకుమించిన పరిష్కారాలు లేవు.
మేం భారత పౌరులం కాదా? మాకు నీటి అవసరాలు ఉండవా? అని విభజన తర్వాత ఎంతగా వాదించినా కావేరి నదీజలాల విషయంలో తమిళనాడు వాదనలాగే/నర్మద నదీజలాల విషయంలో రాజస్థాన్ వాదనలాగే సీమ వాదన కూడా మిగిలిపోతుంది.
This very bad desssion Congrase in seemandra Diposits gallantu Avuthai.