
శవయాత్ర నిర్వహిస్తున్న విద్యార్థులు
ప్రభుత్వ తీరుకు నిరసనగా 7న విద్యాసంస్థల బంద్
కడప: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నందుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌వి ఆధ్వర్యంలో ఆగస్టు7న (శుక్రవారం) విద్యాసంస్థల బంద్‌కు ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు విద్యార్థులు, విద్యాసంస్థలు సహకరించాలని వారు కోరారు.
మంగళవారం స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కార్పొరేట్ శక్తుల మోజులోపడి విద్యారంగ సమస్యలను పక్కనపెట్టారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, సుబ్బరాయుడు, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అంకన్న, పీడీఎస్‌వీ జిల్లా నాయకుడు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.