Tags :aisf

    వార్తలు

    ప్రభుత్వ తీరుకు నిరసనగా 7న విద్యాసంస్థల బంద్

    కడప: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నందుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌వి ఆధ్వర్యంలో ఆగస్టు7న (శుక్రవారం) విద్యాసంస్థల బంద్‌కు ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు విద్యార్థులు, విద్యాసంస్థలు సహకరించాలని వారు కోరారు. మంగళవారం స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కార్పొరేట్ శక్తుల మోజులోపడి విద్యారంగ సమస్యలను పక్కనపెట్టారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    సీమ అభివృద్దిపై వివక్షకు నిరసనగా ఆందోళనలు

    కడప: సీమ సమగ్రాభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్దిపైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ, 24, 25 తేదీలలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్యల జిల్లా నాయకులు చెప్పినారు. మంగళవారం స్థానిక రారా గ్రంథాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ… రాయలసీమపై వివక్ష చూపితే సహించేదిలేదని పరిస్థితిలో మార్పురాకపోతే ప్రభుత్వంపై తిరగబడతామని హెచ్చరించారు. […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

    కడప: పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతిగృహాల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్ అన్నారు. మూసివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని.. లేదంటే మంత్రి రావెల కిశోర్‌బాబు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మంగళవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ విగ్రహం నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ మంత్రి రావెల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    బంద్ విజయవంతం

    కడప: కడప జిల్లా పట్ల ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యింది. సీమలో ఉక్కు పరిశ్రమ, నిరకజలాల సాధనకు ప్రాణ త్యాగాలు చేయడానికైనా వెనుకాడమని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు స్పష్టం చేశారు.  విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందగా మూసి బంద్‌కు  మద్దతు తెలిపారు. కొన్ని చోట్ల సంస్థలను సమాఖ్య ప్రతినిధులు మూయించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్, నగర అధ్యక్షుడు అంకుశం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు […]పూర్తి వివరాలు ...