గురువారం , 21 నవంబర్ 2024

కడప జిల్లాలో ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ – ఒక విన్నపం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కడప జిల్లా పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడమూ, ముఖ్యమంత్రే ఈ జిల్లా గురించి విపరీత బుద్ధితో దుష్ప్రచారం చెయ్యడమూ అందరికీ తెలిసిన విషయాలే.

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది.

ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ మంత్రికి ఒక విన్నపం పంపేదానికి కడప జిల్లా వాసుల తరపున త్రివిక్రమ్ పూనుకున్నారు.  ఈ కార్యక్రమానికి www.www.kadapa.info పూర్తి మద్దతు తెలుపుతోంది.

చదవండి :  'తాళ్ళపొద్దుటూరు'లో ఏమి జరుగుతోంది?

దానికి మద్దతుగా మీ పేర్లు ఈ క్రింది లింకులో ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. (అలాగే అన్నిరంగాల్లోనూ రాష్ట్రంలో అట్టడుగున ఉన్న కడప జిల్లా సమగ్రాభివృద్ధిని కోరుకునే మీ సన్నిహితులకు ఈ విషయాన్ని ఫార్వర్డ్ చెయ్యొచ్చు, లేదా వాళ్ళ సమ్మతితో మీరే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వొచ్చు.)

రండి, కడప జిల్లా అభివృద్ది కోసం మీరూ మాతో చేయి కలపండి. మన అభివృద్ది కోసం గొంతెత్తుదాం!

http://www.ipetitions.com/petition/request-to-establish-electronic-warfare-lab-in/

ఇదీ చదవండి!

జిల్లా కేంద్రంగా కడప

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో …

2 వ్యాఖ్యలు

  1. Every thing is fine but this Chandra babu will notfavor Kadapa. Why the people will not understand this? Is there any solution for this sickness of Government? one is take the help of court or fight for separate RAYALASEEMA state.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: