
12న అమెరికాలో రాయలసీమ వనభోజనాలు
జార్జియాలోని కమ్మింగ్ నగరంలో…
నోరూరించే రాయలసీమ వంటకాలతో మెనూ..
(అమెరికా నుండి నరేష్ గువ్వా)
జులై 12న ఆదివారం నాడు అమెరికాలోని కమ్మింగ్ నగరం (జార్జియా)లో రాయలసీమ వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ పార్కులో ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన రాయలసీమ వంటకాలను వడ్డిస్తారు.
భోజనాల తర్వాత ఆట పాటల కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ వాసులూ, తెలుగు వాళ్ళు, ఆసక్తి కలిగిన ప్రవాస భారతీయులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ వనభోజనాలకు రావచ్చు.
రాయలసీమ వనబోజనాలకు సంబంధించి మరిన్ని వివరాలకు నిర్వాహకులను క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు:
+001-617-840-2422 (దామోదర్)
+001-216-785-4615 (అనిల్)
+001-404-358-1223 (బాలాజీ)
+001-404-488-6271 (సుదీర్)
+001-503-560-2159 (శోభన్)
+001-404-490-9440 (శ్రవణ్)
+001-646-683-5496 (పవన్)
+001-772-985-2707 (రామాంజనేయ)