ఏఆర్‌ రెహమాన్‌ కడపకొచ్చినాడు

ఏఆర్‌ రెహమాన్‌ కడపకొచ్చినాడు

కడప: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ గురువారం కడపకు వచ్చాడు. దర్శించుకున్నారు. నగరంలోని అమీన్‌పీర్‌ దర్గా (పెద్ద దర్గా)లో జరిగిన ఖ్వాజా సయ్యద్‌ అమీనుల్లా మహ్మద్‌ మొహమ్మదుల్‌ చిష్టిపుల్‌ ఖాదిరి ఉరుసు ఉత్సవాల్లో చివరిదైన తహలీల్‌ ఫాతేహా కార్యక్రమంలో రహమాన్ పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సందర్భంగా పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో చదివింపుల కార్యక్రమం ఉదయం 6 గంటలకు నిర్వహించారు. తహలీల్‌ ఫాతేహా చదివింపుల కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.

చదవండి :  ఖాదరాబాద్ లో 'ప్రేమిస్తే ఇంతే' సినిమా చిత్రీకరణ

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: