కడప జిల్లాలో నేడు నగర పాలకం, పురపాలకంలో ఎన్నికల జరగనున్నాయి. కడప నగర పాలకంలో 50 డివిజన్లలో 311 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 47 మంది, వైకాపా తరపున 50 మంది, సిపియం తరపున 12 మంది, బిజెపి తరపున 7మంది, సిపిఐ తరపున ఇరువురు, కాంగ్రెస్ తరపున 8 మంది, ఎంఐఎం, బిఎస్‌పి, లోక్‌సత్తా, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప నగర పాలకంలో 2,07,843 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
పులివెందుల పురపాలకంలో 26 వార్డులు ఉండగా ఒక వార్డులో వైకాపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిడిపి తరపున 21 మంది, వైకాపా తరపున 25 మంది, కాంగ్రెస్ 8 మంది, బిజెపి ఇద్దరు, స్వతంత్రులు 31 మంది మొత్తం 87 మంది బరిలో ఉన్నారు. ఈ పురపాలకంలో 55,159 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
యర్రగుంట్ల మున్సిపాలిటీలో 20 వార్డులలో 23,367 మంది ఓటర్లు ఉండగా 54 మంది బరిలో ఉన్నారు. వైకాపా తరపున 20 మంది, టిడిపి తరపున 20మంది, సిపిఐ 1, సిపియం 1, బిజెపి 1, స్వతంత్య్ర అభ్యర్థులు 11 మంది వార్డులకు పోటీ పడుతున్నారు.
ప్రొద్దుటూరు పురపాలకంలోని 40 వార్డులలో 1,23,481 మంది ఓటర్లు కోసం 244 మంది బరిలో ఉన్నారు. టిడిపి తరపున 40, వైకాపా తరపున 40, ఎంఐఎం 4, బిజెపి 13, కాంగ్రెస్ 6, సిపియం 1, సిపిఐ 1 మిగిలిన గుర్తింపు పార్టీలతో పాటు స్వతంత్రులు 143 మంది బరిలో ఉన్నారు.
రాయచోటి పురపాలకంలో 60,087 మంది ఓటర్లు ఉన్నారు. 31 వార్డులకు 134 మంది బరిలో ఉన్నారు. టిడిపి తరపున ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైకాపా 29 మంది, టిడిపి 29 మంది, ఎంఐఎం 9 మంది, సిపిఐ 2, సిపియం 1, స్వతంత్రులు 64 మంది బరిలో నిలిచారు.
మైదుకూరు పురపాలకంలో 33,319 మంది ఓటర్లకు 23 వార్డులకు 110 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైకాపా 23 మంది, టిడిపి 22 మంది, సిపిఐ 5, బిజెపి 1, స్వతంత్రులు 60 మంది బరిలో ఉన్నారు.
బద్వేల్ మున్సిపాలిటీలో 26 వార్డులలో 145 మంది బరిలో ఉండగా, వైకాపా26 మంది, టిడిపి 26 మంది, కాంగ్రెస్ 12 మంది, సిపియం, సిపిఐ ఇద్దరేసి, బిజెపి 1, స్వతంత్రులు 76 మంది బరిలో మిగిలారు. ఈ మున్సిపాలిటిలో 52,401 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోకున్నారు.
జమ్మలమడుగులోని 20 వార్డులలో 98 మంది బరిలో ఉండగా టిడిపి తరపున 20 మంది, వైకాపా తరపున 20 మంది, కాంగ్రెస్ తరపున 6, సిపియం 2, స్వతంత్రులుగా 50 మంది బరిలో నిలిచారు. ఈ పురపాలకంలో 35,485 మంది ఓటర్లు ఉన్నారు. కడప నగర పాలకంతో పాటు జిల్లాలోని 7 పురపాలక సంఘాలలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.