కడప : సీనియర్ పాత్రికేయుడు, రాయలసీమ ఉద్యమనేత మాసీమ రాజ్‌గోపాల్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు.ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
‘మాసీమ’ పత్రికను స్థాపించి సీమ గళాన్ని వినిపించడంలో రాజగోపాల్ తనదైన పాత్రను పోషించారు. ఆ తరువాతి కాలంలో ‘మాసీమ’ అనేది ఆయన పేరులో భాగమయ్యింది. రాయలసీమ వెనుకబాటుతనం పైనా, ఇక్కడి సాగునీటి అవసరాలపైనా జరిగిన ఉద్యమాలలో రాజగోపాల్ చురుకైన పాత్ర పోషించారు.
ఆయన కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. రాజగోపాల్ మృతి పట్ల ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు.