మామరో కొండాలరెడ్డి – జానపదగీతం

    మామరో కొండాలరెడ్డి – జానపదగీతం

    మామరో కొండాలరెడ్డి
    మామిడీ పూవంటిదాన్ని
    పాయముంటే ఏలుకుంటావా
    కొండాలరెడ్డి-సేసుకొని సూసుకుంటావా

    అంతనైతి ఇంతనైతి
    సంతలో నెరవాజి నైతి
    తగులుకొని నీయంట నేనొత్తి కొండాలరెడ్డి
    ముగము సాటు సేయకోయబ్బి ||మామరో ||

    సింతమాని ఇంటిదాన్ని
    సిలకలా కొమ్మాల దాన్ని
    సిలుకు సీరల వాలుజడదాన్ని కొండాలరెడ్డి
    కులుకు నడకల ఎర్రసినదాన్ని ||మామరో ||

    కొత్తకుండల నీరుతీపి
    కోరిన మగవాడు తీపి
    వాడిన దంటెంతతీపబ్బి కొండాలరెడ్డి
    వాలలాడె బాలపాయము ||మామరో ||

    చదవండి :  మహనందయ్య - జానపద కళాకారుడు (చెక్కభజన)

    బాయిగడ్డన బంగిసెట్టు
    ఎండితే ఒకదమ్ము పట్టు
    కోరేదాన్ని కొంగుపట్టబ్బి కొండాలరెడ్డి
    కోర్కెతో నాసేను దున్నబ్బీ ||మామరో ||

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *