
మందులేదు దీనికి మంత్ర మేమియులేదు
॥పల్లవి॥ మందులేదు దీనికి మంత్ర మేమియులేదు మందుమంత్రము దనమతిలోనే కలదు tonydyson.co.uk ॥చ1॥ కదలకుండఁగఁ దన్నుఁ గట్టివేసినఁ, గట్టు వదలించకొనఁ గొంత వలదా వదలించఁబోయిన వడిగొని పైపైనే కదియుఁగాని తన్ను వదల దేమియును ॥చ2॥ మనసు లోపలనుండి మరి మీఁదఁ దానుండి యెనసిన తిరువేంకటేశుని తనరిన తలఁపునఁ దలఁప దుష్కృతములు తనకుఁదానే వీడుఁ దలఁకవలదుగాన |
రాగము: నాట రేకు: 0026-06 సంపుటము: 1-161 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాట