ఆదివారం , 22 డిసెంబర్ 2024

మంత్రి పదవిపై ఆశలేదంట!

‘నాకు మంత్రి పదవిపై ఆశ లేదు. నేను మంత్రి పదవిని కోరుకోవడంలేదు. మంత్రి పదవి రానంత మాత్రాన నిరాశపడను. అధికారం కోసం ఆరాటపడను.’ అని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి అన్నారు. కమలాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తన ధ్యేయం నెరవేరిందని, మంత్రి పదవిని కోరుకోవడం లేదని చెప్పారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని అందరితో కలిసి పనిచేసి 2014లో అత్యధిక ఎంపీ సీట్లను కైవసం చేసుకొని రాహుల్‌ను ప్రధాని చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు.

చదవండి :  జమ్మలమడుగు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు

ఇంతకీ డి ఎల్ ని పదవీచ్యుతుడిని చేయడమే వీరశివా లక్ష్యమేమో! మొత్తానికి తనకు మంత్రి పదవి రాకపోతే నిరాశపడనని చెప్పడం ద్వారా మంత్రి పదవి రేసులో ఉన్నానని వీరశివా చెప్పకనే చెబుతున్నారా!!

ఇదీ చదవండి!

telugudesham

తెలుగుదేశం ఇలా చేస్తోందేమిటో!

కడప జిల్లాలో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చే నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో మంతనాలు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: