భోగీంద్రులును మీరుఁబోయి రండు – అన్నమయ్య సంకీర్తన

భోగీంద్రులును మీరుఁబోయి రండు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
భోగీంద్రులును మీరుఁబోయి రండు
వేగిన మీఁదటి విభవాలకు
॥చ1॥
హరుఁడ పోయిరా అజుఁడ నీవును బోయి
తిరిగిరా మీఁదటి తిరుణాళ్ళకు
సురలు మునులును భూసురులుఁబోయి రండు
అరవిరి నిన్నాళ్ళు నలసితిరి
॥చ2॥
జముఁడ పోయిరా శశియు నీవును బోయి
సుముఖుఁడవై రా సురలఁ గూడి
గుములై దిక్పతులు దిక్కులకుఁ బోయి రండు
ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి
॥చ3॥
నారద సనకసనందనాదులు
భూరి విభవములఁ బోయిరండు
దూరముగాఁ బోకిట్టే తొరలి వేంకటగిరిఁ
జేరి నన్నిట్లనే సేవించుఁడీ
రాగము: ముఖారి
రేకు: 0070-05
సంపుటము: 1-368

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  వాడె వేంకటేశుఁడనే వాఁడె వీఁడు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: