
కడప రాయని బ్రహ్మోత్సవం మొదలైంది
కడప: దేవుని కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం దీక్షాతిరుమంజనం, సాయంత్రం సేనాధిపతి ఉత్సవంతో ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శోభ వచ్చింది. వాస్తుహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం చేశారు. రాత్రి శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో తితిదే డిప్యూటీ ఈవో బాలాజీ ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఈ రోజు కార్యక్రమాలు
ఉదయం 10 గంటలకు – తిరుచ్చి ధ్వజారోహణం
10.30 గంటలకు – స్నపన తిరుమంజనం, వూంజల్ సేవ
సాయంత్రం – పెద్దశేషవాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో విద్యుత్తు వెలుగులు కనిపించడంలేదు. ఉత్సవ సంకేతాలుగా ఉండే శంఖ, చక్రం లేకపోవడం, గోపురానికి అరకొర వెలుగులు ఉండడంతో భక్తులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నలుదిశల ఏర్పాటు చేసిన దేవతామూర్తులకు వెలుగులు అరకొరగా ఉన్నాయి. తోరణాలు, ముఖద్వారానికి వెలుగులు ఏర్పాటు చేయకపోవడాన్నితప్పుబడుతున్నారు.