జిల్లాకు అన్యాయం
హంద్రీనీవాను పూర్తి చేయడానికి రూ. 1500 కోట్లు అవసరం కాగా.. బడ్జెట్టులో కేవలం రూ. 120 కోట్లు కేటాయించారు. అలాగే గాలేరు- నగరికి రూ. 1200 కోట్లు అవసరమైతే.. బడ్జెట్టులో కేవలం రూ. 169 కోట్లు మాత్రమే కేటాయించి, కడప జిల్లాకు అన్యాయం చేశారు.
– రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాయలసీమ ప్రస్తావన ఏదీ?
వెనుకబడిన ఉత్తరాంధ్రకు రూ.350కోట్లు ప్రకటించిన చంద్రబాబు రాయలసీమ ప్రస్తావన చేయకపోవడం విచారకరం. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతున్నా బడ్జెట్‌లో దాని ప్రస్తావన చేయలేదు. రిమ్స్‌లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు, యోగివేమన విశ్వ విద్యాలయ నిర్మాణాలు పూర్తికి నిధుల కేటాయింపు చేయకపోవడం దారుణం.
– ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ
సరిపడా నిధులు కేటాయించలేదు
ప్రభుత్వం జిల్లాపై వివక్షత చూపుతోందనడానికి నిదర్శనం ఈ బడ్జెట్. ప్రాధాన్యత క్రమంలో ఓ ఒక్క ప్రాజెక్టుకు, అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించలేదు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి కేంద్రప్రభుత్వం స్పందించకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని వూసే ఎత్తలేదు. కేటాయింపులే తక్కువకాగా అందులోనూ ప్రాజెక్టుల వారీగా నిధుల అంశంపై స్పష్టంగా తెలియజేయలేదు.
– ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి, సీపీఎం