కడప : ప్రతిరోజు రాత్రి మనం టివీ ముందు కూర్చుని భోంచేస్తున్న సమయంలో కోల్గెట్ స్కార్‌షిప్ ప్రకటనలో వెంకటహారిక అనే బాలిక వస్తుంది కదా! ఆ అమ్మాయిది వై.ఎస్.ఆర్ జిల్లా ఖాజీపేట మండలంలోని బక్కాయపల్లె గ్రామం.
వెంకట హారిక కోల్గేట్ వారు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ పథకానికి ఎంపిక అయింది. కోల్గేట్ వారు ఈపాపకు లక్ష రూపాయలవరకు చదువుల ఖర్చులకు ఆర్ధిక సాయం అందిస్తారు. వేంకట హరికతో పాటు పాప తల్లిదండ్రులతో కోల్గేట్ 35సెకండ్ల లఘు వాణిజ్య ప్రకటన చిత్రాన్ని రూపొందించి ప్రతిరోజూ వివిధ టీవీ చానళ్ళ ద్వారా ప్రసారం చేస్తోంది.
ఈ ప్రకటనలో పాపతో పాటు వాళ్ల అమ్మా, నాన్న కూడా ప్రకటనలో కనబడి తమ పాప భవిష్యత్తు గురించి, కోల్గెట్ తమ పాపకు చేస్తున్న సాయం గురించి ధన్యవాదాలను తెలుపుతారు. తమ పాపను డాక్టర్ చేస్తానని పాప తండ్రి గంగిరెడ్డి ఆ ప్రకటనలో ధీమాను వ్యక్తం చేస్తాడు.
వెంకట హారిక కుటుంబం ఉద్యోగరీత్యా ఆళ్ళగడ్డలో నివసిస్తోంది. కాగా తమ గ్రామానికి చెందిన బాలిక తో పాటు ఆ బాలిక తలిదండ్రులు రోజూ టీవిలో కనిపిస్తూండటం పట్ల బక్కాయపల్లె గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోల్గెట్ స్కార్‌షిప్ పథకానికి ఎంపికైన ములపాకు వెంకటహారికను మనం కూడా అభినందిద్దాం!
https://youtube.com/watch?v=KKmwGeeYL3A