బొత్సతో కందుల సోదరుల చర్చ
కడప : ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసిన వారి జాబితాలో తాజాగా కందుల సోదరులు చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బొత్సను కలిసి అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా కందుల శివానందరెడ్డి, రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికి డీసీసీ పదవి కట్టబెట్టాలని కోరారు.
కడప అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కృషి చేయాలని కోరారు. దీనికి స్పందించిన బొత్స స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాలకు కృషి చేయాలని సూచించారు. బొత్సను కలిసిన వారిలో లేబాకు మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.