
నేరుపరి వైతేను – అన్నమయ్య సంకీర్తన
చెంతకు చేరిన కడపరాయని చేతలను తప్పు పడుతూ, సవతుల పట్ల ఈర్ష్యను చూపక, నేర్పరితనంతో వానిని కట్టి పడేయమని చెలికత్తె ఆ సతికి ఇట్లా సుద్దులు చెబుతోంది..
వర్గం: శృంగార సంకీర్తన
రాగము: నారాయణి
రేకు: 0704-3
సంపుటము: 16-21
‘నేరుపరి వై..’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.
నేరుపరి వైతేను నెలఁత నీ వాతనికి
నారుకొన్నప్రియముతో నయములే చూపవే ॥పల్లవి॥
సన్నలనే పతికి నిచ్చకురాలవై యుండవే
విన్నపాలు సేయకువే వేమారును
మిన్న కాతనికి మందెమేళముల మీరకువే
మన్నన సతులమీఁద మచ్చరము మానవే ॥నేరుపరి॥
తలఁపులో మెలఁగవే తప్పులు వట్టకువే
చలము సాదించకువే సముకానను
అలుగకువే నీవు ఆతనితో నెప్పుడును
బలిమిఁ బెనఁగుతాను పంతము లాడకువే ॥నేరుపరి॥
వూడిగాలు సేయవే వొద్దునే గాచుకుండవే
వేడుకలు నెరవవే విసువకువే
కూడె శ్రీవెంకటేశుఁడు కొంకక కడపలోన
మేడెపురతుల నిట్టె మెప్పించవే ॥నేరుపరి॥
‘నేరుపరి వై…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.