నాలితనా లేఁటికోయి నారసింహుఁడా – చినతిరుమలాచార్య సంకీర్తన

    నాలితనా లేఁటికోయి నారసింహుఁడా – చినతిరుమలాచార్య సంకీర్తన

    వెయ్యినూతల కోన నారసింహుఁడిని కీర్తించిన చినతిరుమలాచార్య సంకీర్తన

    వర్గము : శృంగార సంకీర్తన
    రాగము: కాంభోది
    రేకు: 04-1
    సంపుటము: 10-18

    నాలితనా లేఁటికోయి నారసింహుఁడా
    నాలోనె నవ్వు వచ్చీ నారసింహుఁడా ॥పల్లవి

    చేరువని ప్రియములు చెప్పి చెప్పి నామీఁద
    నారువోసేవు వలపు నారసింహుఁడా
    దారాసుద్దవుమాఁటలు తాఁకనాడి మదనుని
    నారసాలు సేయకు నారసింహుఁడా ||నాలితనా||

    వెనుకొని నా వెంట వెంటఁ దిరిగి నామీఁద
    ననుపు మోపు గట్టేవు నారసింహుఁడా
    కనుచూపూలనె వట్టి కాఁక రేచి మెత్తనైన
    ననలు వాఁడి సేయకు నారసింహుఁడా ||నాలితనా||

    చదవండి :  ఇందులోనే కానవద్దా - అన్నమయ్య సంకీర్తన

    చిలుకుగోళ్ల నన్నుఁ జెనకుచు నీపై నా
    నలు వెట్టె వచ్చేవు నారసింహుఁడా
    కలికితనాన శ్రీవెంకటనాథ కూడితివి
    నలువై వోగునూతుల నారసింహుఁడా ||నాలితనా||

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *