భార్యాభర్తల తైలవర్ణ చిత్రం
కసువు చిమ్మే నల్లనాగీ… జానపదగీతం
సంసారమనే శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. దానిని సరిచేయటానికి ఒక మనిషంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణ పాట రూపంలో…
వర్గం: జట్టిజాం పాట
పాడటానికి అనువైన రాగం: హిందుస్తాన్ తోడి రాగస్వరాలు (ఏకతాళం)
భర్త: కసువు చిమ్మే నల్లనాగీ గురిగింజ గుమ్మడి
భార్య: సిమ్మను పోరా సిమ్ముకో పోరా గురిగింజ గుమ్మడి
భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ గురిగింజ గుమ్మడి
భార్య: అమ్మా సూడె తంతాడంట గురిగింజ గుమ్మడి
అత్త: ఎందుకు పిల్లగాడ తంతావంట గురిగింజ గుమ్మడి
భర్త: సెప్పిన పని సేయదత్తా గురిగింజ గుమ్మడి
అత్త: సెప్పిన పని సేస్కో బిడ్డా గురిగింజ గుమ్మడి
భర్త: వడ్లు దంచే నల్లనాగీ గురిగింజ గుమ్మడి
భార్య: దంచను పోరా దంచుకో పోరా గురిగింజ గుమ్మడి
భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ గురిగింజ గుమ్మడి
భార్య: అమ్మా సూడె తంతాడంట గురిగింజ గుమ్మడి
అత్త: ఎందుకు పిల్లగాడ తంతావంట గురిగింజ గుమ్మడి
భర్త: సెప్పిన పని సేయదత్తా గురిగింజ గుమ్మడి
అత్త: సెప్పిన పని సేస్కో బిడ్డా గురిగింజ గుమ్మడి
భర్త: కూడూ వార్సి కూరాకు వండే నల్లనాగీ గురిగింజ గుమ్మడి
భార్య: వండను పోరా వండుకో పోరా గురిగింజ గుమ్మడి
భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ గురిగింజ గుమ్మడి
భార్య: అమ్మా సూడె తంతాడంట గురిగింజ గుమ్మడి
అత్త: ఎందుకు పిల్లగాడ తంతావంట గురిగింజ గుమ్మడి
భర్త: సెప్పిన పని సేయదత్తా గురిగింజ గుమ్మడి
అత్త: సెప్పిన పని సేస్కో బిడ్డా గురిగింజ గుమ్మడి
భర్త: నిద్దర మకాన మజ్జిగ సిలికే నల్లనాగీ గురిగింజ గుమ్మడి
భార్య: సిలకను పోరా సిలుక్కో పోరా గురిగింజ గుమ్మడి
భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ గురిగింజ గుమ్మడి
భార్య: అమ్మా సూడె తంతాడంట గురిగింజ గుమ్మడి
అత్త: ఎందుకు పిల్లగాడ తంతావంట గురిగింజ గుమ్మడి
భర్త: సెప్పిన పని సేయదత్తా గురిగింజ గుమ్మడి
అత్త: సెప్పిన పని సేస్కో బిడ్డా గురిగింజ గుమ్మడి
పాటను సేకరించినవారు: కీ.శే.కలిమిశెట్టి మునెయ్య, దొమ్మరనంద్యాల, జమ్మలమడుగు తాలూకా, కడప జిల్లా