నేడు దేవుని కడపలో కోయిల్ఆళ్వార్ తిరుమంజనం

నేడు దేవుని కడపలో కోయిల్ఆళ్వార్ తిరుమంజనం

దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ౩౦ వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని ఆలయ పర్యవేక్షణాధికారి ఈశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయశుద్ధి కార్యక్రమం చేపడతామని తెలిపారు. శ్రీవారి దర్శనం భక్తులకు ఈ సమయంలో ఉండదన్నారు. 11 గంటల నుంచి యథావిధిగా స్వామి దర్శనం కొనసాగిస్తామని తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ప్రారంభమవుతాయన్నారు. ప్రతిరోజు ఉదయ సాయంత్ర వేళల్లో స్వామికి ప్రత్యేక వాహన సేవ ఉంటుందన్నారు. 5న కల్యాణోత్సవం, 6న రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

చదవండి :  చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

ఆళ్వారాలంటే వెంటనే 12గురు ఆళ్వారుల పేర్లు గుర్తుకు వస్తాయి. ఆ 12 గురిలో కొయిల్ ఆళ్వార్ లేడు. దేవాలయాన్నే ఆళ్వార్గా చెప్పడం వైష్ణవ పరిబాష. అంచేత కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన దేవత ఉన్న ప్రదేశాన్ని అభిషేకించిడమని విశిష్టర్ధం. ఆలయ పరిసరాన్ని, ప్రత్యేకించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడాని కోసం జరిపే సేవ `కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం’.

సంవత్సరంలో ఈ ఉత్సవం నాలుగు సార్లు జరుగుతుంది. ఉగాది, ఆణివార ఆస్టానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాలలో ఈ సేవ జరుగుతుంది. సుగందద్రవ్యదులతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేయడం ఈ ఉత్సవం ప్రత్యేకత.

చదవండి :  ఆడరాని మాటది - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *