అనంతపురం తెదేపా నేతల దాదాగిరీ

    అనంతపురం తెదేపా నేతల దాదాగిరీ

    పులివెందుల బ్రాంచి కాలువకి గండి కొట్టి చిత్రావతికి నీరు

    పులివెందుల: అనంతపురం తెదేపా నాయకులు పట్టపగలే దౌర్జన్యానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరు గ్రామం వద్ద కృష్ణాజలాలను సోమవారం అనంతపురం ప్రజాప్రతినిధులు అధికారుల సాక్షిగా దౌర్జన్యంగా మళ్లించుకున్నారు. కాల్వ గట్టును ధ్వంసం చేసి అనంతపురం జిల్లాకు సాగునీటిని తీసుకుపోయారు. తద్వారా పులివెందులకు కృష్ణాజలాలు రావడం నిలిచిపోయింది.

    వివరాలలోకి వెళితే.. తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి, ఆ జిల్లా ప్రభుత్వ విప్ అయిన సింగనమల ఎమ్మెల్యే యామిని బాలలు వారి అనుచరులతో కలిసి కల్లూరు డిస్ట్రిబ్యూటరీ వద్దకు జేసీబీతో వచ్చారు.

    చదవండి :  7న కడపకు బాబు

    పీబీసీ కాలువను (పీబీసీ ప్రధానకాలువ 2.625 కి.మీ. వద్ద) ధ్వంసం చేసి నీటిని చిత్రావతి నదిలోకి నీటిని మళ్లించారు. అనంతపురం ఆర్డీవో ఉస్సేన్‌సాహెబ్, తాడిపత్రి డీఎస్పీ నాగరాజుల సమక్షంలో తెదేపా నాయకులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు.

    నీటిని నిలిపి వేశాం

    చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల నిలిపి వేశామని పీబీసీ డీఈ జయకుమార్ బాబు తెలిపారు. ప్రస్తుతం సీబీఆర్‌లో ఒక టీఎంసీ నీరు మాత్రమే ఉందన్నారు. జీడిపల్లె రిజర్వాయర్ నుంచి విడుదల అవుతున్న నీరు ఆగిపోయిందని, దీంతో తుంపెర నుంచి సీబీఆర్‌కు నీరు రాలేదన్నారు.

    చదవండి :  వరదరాజులురెడ్డి అందుకే దేశంలోకి వచ్చారా!

    అధికార పార్టీ నాయకులు ధ్వంసం చేసిన పీబీసీ కాలువను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించి నక్కలపల్లె ఎస్‌ఎస్ ట్యాంకుకు నీరు విడుదల చేయిస్తామన్నారు.

    ఇప్పుడు కడప జిల్లా తెదేపా నేతలు స్పందిస్తారా?

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *