ఆదివారం , 22 డిసెంబర్ 2024

తెదేపాకు మదన్ రాజీనామా

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజంపేట మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గత ఉపఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పసుపులేటి బ్రహ్మయ్యకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అప్పటి నుంచి టీడీపీలో మదన్ అంటీ అంటనట్లుగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ ఆయన పట్ల చంద్రబాబునాయుడు మొగ్గుచూపలేదు. మదన్‌తోపాటు బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ ఇచ్చారు.

చదవండి :  'రాక్షస పాలన కొనసాగుతోంది' - సిఎం రమేష్

ఈనేపథ్యంలో ఇటీవల తన వర్గీయులతో మదన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మేడా రాకపోవడంతో అలక చెందారు. అనంతరం మేడా స్వయంగా వచ్చి సమావేశానికి గైర్హాజరు కావడానికి కారణాలు చెప్పుకున్నారు.  సోమవారం కూడా టీడీపీ అభ్యర్ధి మేడా మల్లికార్జునరెడ్డి వెంట పట్టణంలోని నారపురెడ్డిపల్లె ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

నీటిమూటలేనా?

కడప జిల్లాకు చంద్రబాబు హామీలు

వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు… తేదీ: 30 అక్టోబర్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: