తిరువీధుల మెరసీ దేవదేవుడు – అన్నమాచార్య సంకీర్తన

    తిరువీధుల మెరసీ దేవదేవుడు

    గరిమల మించిన సింగారములతోడను
    …..
    తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు

     సిరుల రెండవనాడు శేషుని మీద

    మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద

    పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను
    ……..


    గ్రక్కుననైదవనాడు గరుడునిమీద

    యెక్కెనునారవనాడు యేనుగుమీద

    చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను

    యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు
    …….
    కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు

    పెనచి పదోనాడు పెండ్లిపీట

    యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో

    వనితల నడుమను వాయనాలమీదను….

      చదవండి :  రాయలసీమ జానపదం - తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *