
‘తానా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా మనోడు
కడప : ప్రవాసాంధ్రుల సంఘం ‘తానా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా కడప జిల్లాకు చెందిన వేమన సతీష్ ఎంపికయ్యారు. ప్రస్తుత కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలలో సతీష్ 5120 ఓట్ల ఆధిక్యత సాధించి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సతీష్ ఇప్పటికే తెదేపా తరపున క్రియాశీలకంగా పని చేస్తున్నారు.
తానా ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో సతీష్ కడప జిల్లాను కూడా భాగం చేస్తారని ఆశిద్దాం.
[box type=”shadow” align=”aligncenter” class=”” width=””]తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వేమన సతీష్ గారికి అభినందనలు!