తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు జమ్మలమడుగులో బుధవారం సాయంత్రం జరిగే రోడ్‌షోలో పాల్గొంటున్నారు. ఆయన పర్యటన వివరాలను జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి వివరించారు.
సాయంత్రం 3.30 గంటలకు పీఆర్ హైస్కూలులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి నీళ్లట్యాంకు వద్ద నుంచి రోడ్‌షో ప్రారంభం అవుతుంది. పాత బస్టాండు, మార్కెట్‌వీధి, మెయిన్‌బజార్, అమ్మవారిశాల వీధి, పలగాడి వీధి, తేరు రోడ్డు, పెద్దపసుపుల జంక్షన్, సంజాముల మోటు, ఎస్‌బీఐ ద్వారా పాత బస్టాండు చేరుకుంటారు.
అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పీఆర్ హైస్కూల్లోని హెలిప్యాడ్ వద్దకు సాయంత్రం 5.15 గంటలకు చేరుకొని తిరుపతిలో జరిగే మోదీ సభకు బయల్దేరి వెళ్తారు.
బాబు రోడ్‌షో నేపధ్యంలో జమ్మలమడుగు పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆయా రూట్లలో ప్రయాణించే ప్రజలు షో సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లడం లేదా షో ముగిసే వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది!