
వైఎస్ జగన్ – పులివెందుల
జగన్ బయటకొస్తే వార్ వన్ సైడే…
వైకాపా చీఫ్, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అని మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్‌పై విచారణ సమయంలో సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఐతే సుప్రీంకోర్టు బెయిల్ పిటీషన్ను తోసిపుచ్చింది. దీంతో పార్టీ శ్రేణులంతా నిరాశ చెందాయి. కానీ జగన్ అభిమానులు, ముఖ్యంగా యువత సామాజిక సైట్ ఫేస్ బుక్‌లో జగన్‌కు బెయిల్ వస్తుందనీ, నెక్ట్స్ సీఎం జగనే అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.
జగన్ బయటకొస్తే వార్ వన్ సైడేననీ… జగన్ వస్తే ‘హస్తం’కు వణుకు పుడుతుంది. ‘సైకిల్’కు పంక్చర్ అవుతుందని ఓ అభిమాని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనికి విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. జగన్‌కు బయటకు 2014 ఎన్నికల వరకు రాలేడనే భ్రమలో టీడీపీ, కాంగ్రెస్ ఉన్నాయని ఒకరు…. జగన్ అనే సునామీలో టీడీపీ, కాంగ్రెస్‌లు కొట్టుకుపోతారని మరొకరు తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు.
ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఢిల్లీ వెళ్ళిన బాబు కాంగ్రెస్ నేతలతో చర్చించారని, జగన్‌కు బెయిల్ రాకుండా చూడండని వారిని బాబు ప్రాధేయపడ్డాడని మరొక అభిమాని కామెంట్ చేశాడు. వాళ్లంతా చెపుతున్నదేంటయా అంటే, జగన్ వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నదే. మరి వీరి అభిప్రాయాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.