ప్రాణుల పేర్లు

అవి చిరుతపులి పాదాల గుర్తులే!

రైల్వేకోడూరు మండల పరిధిలోని ఆర్.రాచపల్లె తోటలలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి తిరగడంతో స్థానికులు బెంబేలెత్తారు.  మూడు రోజులుగా ఈ ప్రాంతంలోని అరటితోటల్లో చిరుతపులి తిరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పొలాల్లో నీటితడులు కట్టిన తర్వాత ఏదో అడవిజంతువు తిరుగుతుందని పాదాల గుర్తులు చూసి అనుకున్నామని , అయితే శుక్రవారం వేకువజామున తమ తోటలో నీరు తడి కట్టేందుకు వెళ్లానని భాస్కర్‌రాజు అనే రైతు పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తన తోటలో నిలబడి ఉన్న చిరుతపులిని చూసి భయపడి గ్రామంలోకి ఉరుకులు పరుగులు తీశానన్నారు.

చదవండి :  గంగమ్మను దర్శించుకున్న నేతలు

గ్రామానికి చెందిన పలువురి తోటల్లో ఈ పులి సంచరించినట్లు అడుగులు ఉన్నాయి. తోటల్లో ఉన్న ఒక పొదలో ఈ పులి రాత్రుళ్లు నిద్రపోతున్నట్లు రైతులు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలిపారు. దీంతో బాలుపల్లె అటవీ రేంజర్ ఆదేశాల మేరకు ఎఫ్ఎస్‌వో, ఎఫ్‌బీవో సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పాదాల గుర్తులను పరిశీలించారు. అవి చిరుత పులి పాదాల గుర్తులేనని నిర్ధారించారు.

ఉన్నతాధికారులతో మాట్లాడి  తోటల్లో రిస్క్యూవ్యాన్ ద్వారా బోన్ ఏర్పాటు చేసి పులిని పట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.

చదవండి :  రైల్వేకోడూరులో ముఖ్యమంత్రి పర్యటన

ఇదీ చదవండి!

ys jagan

ప్రమాణ స్వీకారం చేసినారు…ఆయనొక్కడూ తప్ప!

జిల్లా నుండి గెలుపొందిన శాసనసభ్యులలో తొమ్మిది మంది గురువారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినారు. పులివెందుల శాసనసభ్యుడు, ప్రతిపక్షనేత వైఎస్ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: