వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులకు పతకాల పంట

క్రీడా పాఠశాలలోని ఈతకొలనులో అభ్యాసం చేస్తున్న విద్యార్థులు (పాత చిత్రం)

వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులకు పతకాల పంట

అండర్-17 విభాగంలో  5 బంగారు పతకాలు

అండర్-14 విభాగంలో  11 బంగారు పతకాలు

కడప: విజయవాడలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి ఈత(స్విమ్మింగ్) పోటీలలో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. మొత్తం 29 పతకాలను (16 బంగారు, 11 వెండి, 3 కాంస్య పతకాలు) సొంతం చేసుకుని కడప జిల్లా కీర్తి పతాకను ఎగరేశారు. పతకాలు సాధించిన విద్యార్థులలో 11 మంది డిసెంబరు 15 నుంచి 20వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో జరిగే జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

చదవండి :  పుష్పగిరిలో సినిమా చిత్రీకరణ

అండర్-17 విభాగంలో హరిబాబు 3, మునిశేఖర్ 2 బంగారు పతకాలు సాధించారు. అండర్-14 బాలికల విభాగంలో నాగేశ్వరి, లక్ష్మినిర్మల మూడేసి బంగారు పతకాలను అందుకున్నారు. ఇదే విభాగంలో శ్రావణి బంగారు పతకం సాధించింది.

అండర్-14 బాలుర విభాగంలో ఇంకో నలుగురు విద్యార్థులు ఒక్కో బంగారు పతకాన్ని సాధించారు. వీరితోపాటు పదిమంది వెండి పతకాలు, 3 కాంస్య పతకాలను అందుకున్నారు.

తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో 29 పతకాలను సాధించడం ఆనందంగా ఉందని ఇన్‌ఛార్జి ప్రత్యేకాధికారి బాషామొహిద్దీన్ తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో కూడా తమ విద్యార్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *