గురువారం , 21 నవంబర్ 2024

‘కొప్పర్తి పరిశ్రమలవాడలో భూముల ధరలు ఎక్కువ’: కలెక్టర్

గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమే

కడప :  కొప్పర్తి పరిశ్రమల పార్కులో పెద్ద, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నందువల్ల వెనక్కి తగ్గుతున్నారని జిల్లా కలెక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా సోమవారం స్థానిక సభాభవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు.

ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన మాట్లాడుతూ గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమేనన్నారు. అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందన్నారు. అందరి సహకారంతో ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని.. అక్కడ ఇళ్లు కోల్పోయిన 72 మందికి నివాసాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

చదవండి :  వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

జిల్లాలో ఇండస్ట్రీయల్ పార్కుకోసం 78,732 ఎకరాలు గుర్తించామన్నారు. గాలివీడు మండలంలో సోలార్ పార్కుకు 3,600 ఎకరాలు భూమి అప్పగించామన్నారు.  కొప్పర్తి పారిశ్రామికవాడలో భూమి ధర అధికంగా ఉన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెల్లామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అల్ట్రా మెగా సోలార్ పార్కుకోసం 28,626 ఎకరాలు గుర్తించామన్నారు. అనిమెల సమీపంలో విండ్‌పవర్, ఎస్టీం విండ్‌పవర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసిపంపామని చెప్పారు.

గండికోటలో స్కైవాక్ ఏర్పాటు చేసేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలన చేసి వివరాలు పంపాలని సీఎం చెప్పారని.. అందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చదవండి :  ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబూ పోయే!

జిల్లాలో విమానాశ్రయం ప్రారంభమైందని, హాజ్‌హౌస్ ఏర్పాటుకు సీఎం హామీ ఇచ్చారన్నారు. గతంలో నీటిపారుదుల రంగం కలెక్టర్లు చూసేవారు కాదని ఇప్పుడు ఆ బాధ్యత కూడా కలెక్టర్లపై పెట్టడంతో అన్నింటిపైనా సమీక్షిస్తున్నామన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో జిల్లా రాష్ట్రంలో అయిదో స్థానంలో ఉందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణతలో మొదటి స్థానం, ఉపాధి హామీలో రెండో స్థానం సాధించామన్నారు.

ఇదీ చదవండి!

సిద్దేశ్వరం ..గద్దించే

6న అఖిలపక్షం కలెక్టరేట్ ముట్టడి

కడప: జిల్లా కలెక్టర్ కెవి రమణ వ్యవహారశైలికి నిరసనగా సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. కడప జిల్లా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: