గురువారం , 21 నవంబర్ 2024

కుందిలిచెర్లోపల్లె గుహ

ప్రత్యేకత: భూమిలోపల ఇంద్రభవనాన్ని తలపించే సహజసిద్ధ దృశ్యాలు, నీటిధారకు స్ఫటికలింగంలా మారిన రాళ్లు, నీటి చుక్కల ధార – రెండువేల ఏళ్ల కిందట ఆదిమమానవుడు నివసించిన ఈ కుందిలిచెర్లోపల్లె బిలం సొంతం.

బిలం లోపలికి ఇలా వెళ్ళాలి: ప్రారంభంలో బండరాళ్లను దాటుకొని లోపలికి వెళ్లాలి. 10 మీటర్లు లోనికి వెళ్లిన తర్వాత ఎత్తుభాగం నుంచి కిందికి దిగాలి. అక్కడి నుంచి రెండు మీటర్లు నేలమీద పాకుతూ వెళ్లాలి. 600 మీటర్లు లోనికి వెళితే నీటి చుక్కధారలు కిందికి పడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. వీటిని చూసి తీరాల్సిందే. నీటి ధారకు పాలరాతిగా మారిన ఆకారాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడే మయసభను తలపించే కట్టడాలు మనకళ్లకు కనిపిస్తాయి. లోపలి చల్లని గాలి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళితే ఆదిమమానవుడు నివసించిన బిలం అందాలు చూడొచ్చు

చదవండి :  దేవుని కడప

చారిత్రిక నేపధ్యం:  12 ఏళ్ల క్రితం బిలంలో పరిసర గ్రామాల ప్రజలకు ఆదిమానవుడు వాడిన మట్టిపాత్రలు, ప్రమిదలు, ఆహారపు గింజలు నిల్వ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన గాదెలు అప్పట్లో లభించాయి. పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు రెండువేల ఏళ్ల నాటి ఆదిమమానవుడు బిలంలో నివసించాడని నిర్దారించారు.

ఎక్కడుంది? : కుందిలిచెర్లోపల్లె, కోమన్నూతల పంచాయతీ (పులివెందుల తాలూకా)

ఎలా వెళ్ళాలి? : పులివెందుల నుంచి రహదారి మార్గాన వెళితే పార్నపల్లె నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కుందిలిచెర్లోపల్లె ఉంది.

చదవండి :  ముత్తులూరుపాడు

సమీపంలోని పర్యాటక ఆకర్షణలు : పెంచికల బసిరెడ్డి జలాశయం, పార్నపల్లె కోనమల్లేశ్వర ఆలయం

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: