
కాడిమాను అనే పదానికి అర్థాలు, వివరణలు
కడప జిల్లాలో వాడుకలో ఉన్న కాడిమాను అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms of the word ‘కాడిమాను’ in Telugu Language.
కాడిమాను :
నామవాచకం (noun), ఏకవచనం (Singular)
- ఎద్దులతో కాడి కట్టడానికి ఉపయోగించే ఒక కర్రమాను
- ఒక వ్యవసాయ పనిముట్టు
వివరణ :
కడప జిల్లాలో కాడిమాను అనేది ఒక వ్యవసాయ పనిముట్టు. పని చేసె ఎద్దుల మెడపై వుంచి దానిని వాటి మెడకు పలుపుతో కట్టే ఒక కర్ర మాను. కొయ్యతో చేసినది. దీన్ని ఎద్దుల మెడపై వేసి బండికి..నాగలి వంటి పనిముట్లు కట్టి ఎద్దులతో పని చేయించడానికి ఉపయోగిస్తారు.ఎద్దులతో ఏ పని చేయించాలన్నా ఎద్దుల మెడ పై ఈ పనిముట్టు పెట్టాల్సిందే. కాడి మాను పైకి లేపగానే ఎద్దులు తలలు వంచి దాని కిందికి దూరి మెడలపై ఉంచుకుంటాయి
వాడుక :
- సేద్యానికి పోవాల కాడి మాను సిద్ధం చేయి
- కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా? (బైబిల్)