‘ఇ’తో మొదలయ్యే కడప సామెతలు …
‘ఇ ‘ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు.
- ఇంటి ఎద్దుకు బాడుగ
- ఇంటికన్న గుడి పదిలం
- ఇంటికో కడిదిని గుంటగ్గుక్కనీల్ దాగినట్టు
- ఇంతే సంగతులు చిత్తచ్చవలయును
- ఇచిత్రానికి ఇద్దురు పుడితే ఈడ్చలేక ఇద్దరు సచ్చిరంట
- ఇచిత్రానికి ఈర్లు బెడితే ఇంటాదికి యారగబెట్నంట
- ఇచ్చేటోడు ఉంటే సెచ్చోటోడు లేసొచ్చినంట
- ఇచ్చేవోన్ని సూసి చ్చేవోడుకూడా లేసొచ్చ
- ఇట్లిట్లే రమ్మంటే ఇల్లంతా నాదే అన్నెంట
- ఇత్తుముందా చెట్టు ముందా
- ఇల్లు అలగ్గానే పండగ కాదు