ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం ఆందోళనలు

    ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కలెక్టరేట్ ఎదుట ఆందోళన

    ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం ఆందోళనలు

    కడప: జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

    ఉర్దూ విశ్వవిద్యాలయ సాధనకు నగరంలోని ఉర్దూ మాతృభాషాభిమానులు, కవులు, ప్రజాప్రతినిధులు ఉర్దూ విశ్వవిద్యాలయ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరహారదీక్షలు చేపట్టారు.

    ప్రభుత్వం దిగొచ్చే వరకు రోజూ 25 మందితో దీక్షలు చేపడతామని యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలాఉద్దీన్ తెలిపారు. మాట మార్చిన వ్యక్తులకు మద్దతు పలికే వారు తక్షణం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చేసే పని సార్థకత ఉండేలా వ్యవహరించాల్సిన వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తూ ప్రాంతాల మధ్య విభేదాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.

    చదవండి :  రాయలసీమకు తరతరాలుగా అన్యాయం: బి.వి.రాఘవులు

    విశ్వవిద్యాలయం ఒక ఇంటి విషయం కాదు. అది విజ్ఞానాలయం. అలాంటి పవిత్రమైన అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేయడం అన్యాయమని కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా అన్నారు.దీక్షలో పలువురు ఉర్దూ భాషాభిమానులు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

     జిల్లాలో అక్కడక్కడ ఉర్దూ భాషకు సంబంధించి ప్రత్యేక పాఠశాలలున్నా కళాశాలలు ఇంటర్ స్థాయిలోనే ఆగిపోయాయి. కనీసం ఉర్దూ భాషకు సంబంధించిన విద్యార్థులు డిగ్రీ చదువుకోవాలన్నా కూడా ఇక్కడ సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. డిగ్రీ స్థాయిలో ఉర్దూభాష చదువుకోవాలంటే తిరుపతి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    చదవండి :  కడపలో సినీ నటుడు బ్రహ్మాజీ

    రైల్వేకోడూరు బహిరంగసభలో చంద్రబాబు కడపలో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పలుచోట్ల తెదేపా నేతలు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇపుడు ఏం సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో వారు సందిగ్ధంలో పడ్డారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *