లింగాల : అనంతపురం జిల్లాకు చెందిన కొంత మంది వైఎస్సార్ అభిమానులు వైఎస్ మాలదారణ చేసి ఇరుముడితో ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టారు. అనంతరుపురం నగరానికి చెందిన గాలి నరసింహారెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, రాజమోహన్, లక్ష్మున్న, ఓబిరెడ్డి, వెంకటరామిరెడ్డి, నీలకంఠారెడ్డిలు వైఎస్ మాల ధరించి, ఇరుముడితో 29వతేదీన అనంతపురం నుంచి బయలు దేరారు. బత్తలపల్లె, దాడితోట, పార్నపల్లె, లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మీదుగా ఇడుపులపాయ చేరుకుంటారు. వీరి కాలినడక బుధవారం లింగాలకు చేరింది. వైఎస్ వర్ధంతి రోజున ఇడుపులపాయకు చేరుకుని అక్కడ ఇరుముడి చెల్లిస్తామని వైఎస్సార్ అభిమానులు ఈ సందర్భంగా తెలిపారు. లింగాలలో సేదతీరుతున్న వైఎస్ అభిమానులకు వైఎస్సార్ మండల నాయకుడు సారెడ్డి శివప్రసాద్ రెడ్డి భోజన సౌకర్యం కల్పించారు. దారిపొడవునా వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను స్మరిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఇరుముడితో వైఎస్ రుణం తీర్చుకోవడం పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి!
మనువు (కథ) – సొదుం జయరాం
సొదుం జయరాం కథ ‘మనువు’ ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది. నిజానికి ఆ ఇంట్లో అంతగా …