ఆ ఆలోచనే వాళ్లకు లేదు …

    ఆ ఆలోచనే వాళ్లకు లేదు …

    వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఈ విషయం రాష్ట్రంలో చిన్న పిల్లాడికి కూడా తెలుసని ఆయన భార్య వైఎస్ భారతి అన్నారు. జగన్‌ను జైల్లో ఉంచడమే సీబీఐ లక్ష్యమని, అందుకే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయాలన్న ఆలోచనే సీబీఐకి లేదని ఆమె విమర్శించారు. గురువారం ఆమె ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానెల్ ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ …

    ‘‘ఈ కేసును సీబీఐ 21 నెలలుగా దర్యాప్తు చేస్తోంది. అక్టోబర్‌లో బెయిల్‌కోసం పిటిషన్ వేసినప్పుడు.. మరో మూడు నెలల గడువు కావాలని సీబీఐ వారు అడిగారు. ఇప్పటికి 8 నెలలైంది. ఇప్పుడు మరో 4 నెలల సమయం కావాలని అంటున్నారు. ఇవాళ(గురువారం) సుప్రీంకోర్టు అలా తీర్పు ఇచ్చిందో లేదో వారి న్యాయవాది బయటకొచ్చి మాట్లాడుతూ.. 4 నెలల తర్వాత తాము ఈ గడువును పెంచాలని అడిగే అవకాశముందని చెప్పారు. దర్యాప్తు పూర్తి చేయాలన్న ఆలోచనే వారికి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే అసలు దర్యాప్తే జరగడం లేదు కాబట్టి’’

    చదవండి :  బెంగుళూరులో రాయలసీమ చైతన్య సదస్సు

    బయటకొచ్చారు కాబట్టే..

    కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు వేసి వేధిస్తున్నారని అన్నారు. ‘‘జగన్‌కు ఇప్పట్లో బెయిల్‌రాదని, ఏదో ఒక రోజు ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో కలపక తప్పదని ఇటీవల కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా అన్నారు. జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే ఆయన మీద కేసులే ఉండేవి కావని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా అప్పట్లో చెప్పారు. జగన్ మీద చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని ప్రజలకు తెలుసు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. గత ఉప ఎన్నికల్లోనూ వారు కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతూ తీర్పు ఇచ్చారు’’ అని భారతి అన్నారు.

    చదవండి :  విపక్ష నేత సీమ గురించి మాట్లాడారోచ్!

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *