శనివారం , 21 డిసెంబర్ 2024
అనంతపురం గంగమ్మ దేవళం
అనంతపురం గంగమ్మ దేవళం

ఈ రోజు నుంచి అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ జాతర

అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ప్రసిద్ధి – శనివారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనార్థం రానున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

తిరుణాల్ల నేపధ్యం …

అనంతపురం గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి పొలం గట్టుకు కావాల్సిన కంప కొట్టి తొడుగేశారు. తీసుకెళ్లేందుకు కాడెద్దులతో కదిలించగా కదలలేదు. ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలోకి వచ్చి తాను అండీ అనంతపురం నుంచి వచ్చి కంపతొడుగు కింద ఉన్నానని.. పూజలు నిర్వహించి ఆలయం నిర్మించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులందరు అలానే చేశారు. కంపతొడుగు తొలగించి చూడగా అమ్మవారు రాయి రూపంలో ప్రత్యక్షమై అనంతపురం అమ్మవారుగా పేరుగాంచినట్లు చారిత్రిక కథనం.

చదవండి :  ఔను..వీళ్ళు కూడా అంతే!

అనంతపురంలో అమ్మ వారు కొలువైన సమయంలోనే మండలంలోని చాగలగట్టుపల్లిలో పల్లు కృష్టారెడ్డి పశువల గాట అమ్మవారి విగ్రహం కనిపించిందట. ప్రతి అమావాస్యకు ప్రత్యేక పూజలు చేస్తూ వచ్చారు. తిరునాళ్లకు ముందురోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జాతరకు తీసుకొస్తారు.

ఉత్సవాలు ఇలా..

గొల్లపల్లె నుంచి శుక్రవారం రాత్రి అమ్మవారిని తీసుకుని శనివారం ఉదయం అనంతపురం ఆలయానికి చేరుకుంటారు. శనివారం అమ్మవారి జాగారం మొదలువుతుంది.

ఆదివారం తిరునాళ్ల, అమ్మవారికి సిద్ధలపూజ, బోనాలు, చాందినీ బండ్ల మెరవణి ఉంటాయి. 3న మైలతిరునాళ్ల, అమ్మవారి మెరవణి, అమ్మవారికి గంగస్నానాలు, అభిషేకాలు ఉంటాయి.

చదవండి :  తెదేపా గూటికి చేరిన వరద

జాతరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీరికి అవసరమైన తాగునీరు, వసతి, విద్యుత్తు దీపాల ఏర్పాటు, జాతరకు వచ్చే మార్గాల్లో రాదారుల మరమ్మతు వంటి పనులు చేస్తున్నారు.

అనంతపురం గంగ జాతర ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

అనంతపురం గంగమ్మ జాతరకు ఇలా చేరుకోవచ్చు :

రోడ్డు మార్గంలో:

దగ్గరి బస్సు స్టేషన్: కడప,రాయచోటి 

కడప నుండి (40 KMs)

Kadapa –> Guvvala Chruvu –> Ramapuram –> Chitlur –> Ananthapuram Village

రాయచోటి నుండి:

చదవండి :  ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

Rayachoty –> Chitlur cross –> Ananthapuram Village

రైలు మార్గంలో:

కడప లేదా తిరుతి రైలు స్టేషనులో దిగి అక్కడి బస్సు లేదా ప్రయివేటు వాహనాలలో అనంతపురం చేరుకోవచ్చు.

విమానంలో:

దగ్గరి విమానాశ్రయం: Tirupati, Bangalore, Chennai, kadapa

 ప్రత్యేక బస్సులు

జాతరకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, హైదరాబాదు, నెల్లూరు ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు. వీరిని చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

రాయచోటి, కడప, పులివెందుల, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి!

రాజంపేట

రాజంపేట పట్టణం

రాజంపేట పట్టణ విశేషాలు, చరిత్ర, జనాభా వివరాలు మరియు ఫోటోలు. రాజంపేటకు వెళ్లే వారి కోసం అవసరమైన సమాచారం మరియు సూచనలు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: