స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల తొలి విడత సమరం ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

స్థానిక ఎన్నికలను బ్యాలెట్‌ పద్దతిలో నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు‌, MPTC గులాబి రంగు బ్యాలెట్‌ పత్రాలను వాడుతున్నారు.

రాయచోటి మండలం అబ్బవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా కార్యకర్తలు తోపులాటకు దిగడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చదవండి :  మంగళవారం దేవగుడిలో రీపోలింగ్

రాజంపేట మండలంలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 7గంటలకే ఓటు వేసేందుకు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఇదీ చదవండి!

jammalamadugu

జమ్మలమడుగు అరాచ(జ)కీయం వెనుక కథ

జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక పేర అధికార పార్టీ రేపుతున్న దుమారం ఉద్రిక్తతలకు దారితీసింది. జానీ అనే తెదేపా కౌన్సిలర్ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: