జీవిత బీమాపై సేవా పన్నును తొలగించాలి

కడప: జీవిత బీమా పాలసీదారులపై ప్రభుత్వ విధిస్తున్న సేవా పన్నును తొలగించాలని భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్లు డిమాండ్ చేశారు. జీవిత బీమా పాలసీదారులపై కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం నాగరాజుపేటలోని జీవిత బీమా కార్యాలయం ఎదుట సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలసీదారుల బీమా గడువుతీరిన తర్వాత ఇచ్చే మొత్తంపై ఆదాయ పన్నును తొలగించాలని కోరారు. బీమా బిల్లులోని సెక్షన్ 40, 40ఏ, 40(2), 45లను యధావిధిగా కొనసాగించాలని కోరారు. పిల్లలు, పెద్దలకు ఉపయోగపడే విధంగా కొత్త పాలసీలు ప్రవేశపెట్టాలన్నారు.

చదవండి :  హమ్మయ్య... వానొచ్చింది

కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 21న కడప డివిజన్(కడప, కర్నూలు, అనంతపురం) జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఏజెంట్లుతో కడపలో ర్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: