సీమ సమస్యలపై

సీమ సమస్యలపై ప్రశ్నించినందుకు దాడి

ప్రత్యేకహోదా డ్రామా వికటించింది

ఒకే రోజులో డ్రామా కట్టేశారు

(అనంతపురం నుండి మా విశేష ప్రతినిధి)

అనంతపురంలో ప్రత్యేకహోదా పేరుతో నిన్నటి నుండి నిరవధిక దీక్ష చేస్తున్న చలసాని శ్రీనివాస్, ఈ రోజు అక్కడికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సినిమా నటుడు శివాజీలను సీమ సమస్యలపై ప్రశ్నించిన రాయలసీమ సోషల్ మీడియా ఫోరంకు చెందిన యువకుడిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో నిన్నటి నుండి ప్రత్యేక హోదా పేరుతో చలసాని, శివాజీలు కలిసి రక్తి కట్టిద్దామనుకున్నడ్రామా కాస్తా వికటించింది. కట్ చేస్తే సాయంత్రం షోతో డ్రామాకు తెరపడింది.

సీమ సమస్యలపైవివరాల్లోకి వెళ్తే… అనంతపురంకు చెందిన ‘కృష్ణా నాయక్ అలియాస్ సీమ కృష్ణ’, మరికొందరు యువకులు ఈ రోజు చలసాని దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వీరు అక్కడే ఉన్న నటుడు శివాజీ, చలసానిలను కలిసి సీమ సమస్యలపైన స్పందించాలని కోరారు. జీవో 69, జీవో 120ల ద్వారా రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మేధావిగా చెప్పుకునే చలసాని గారు మౌనం వహించగా, నటుడు తనకు జీవోల గురించి తెలియదని బదులిచ్చారు. అలానే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటానికి ఉండవలసిన కారణాలు చెప్పమని అడుగగా శివాజీ తెలియదని బదులిచ్చారు.

చదవండి :  రాజధాని కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

దీంతో దీక్షా శిబిరంలో కూర్చుని కమ్యూనిస్టులుగా చెప్పుకుంటున్న కొంతమంది కృష్ణా అతని మిత్రులపై దాడికి తెగబడ్డారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పి వెళ్ళారు. పోలీసులు వెళ్ళిన కొద్ది సేపటికి చలసాని, శివాజీల ప్రోద్భలంతో మరోసారి కృష్ణ మీద దాడికి ప్రయత్నించారు.

దాడి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు రాయలసీమలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. రేపు అనంతపురంలో ప్రత్యేక హోదా దీక్షకు నిరసనగా ఆందోళన చేపట్టాలని సోషియల్ మీడియా ఫోరం పిలుపు ఇవ్వడంతో సాయంత్రమే చలసాని దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

చదవండి :  ఎందుకింత చిన్నచూపు?

పౌర సమాజంపైన జరిగిన దాడి

రాయలసీమ కోసం పనిచేస్తున్న ఒక యువకుడిపై దాడికి పాల్పడటం హేయమైన చర్య. కృష్ణ పైన జరిగిన దాడిని రాయలసీమ పౌర సమాజంపైన జరిగిన దాడిగా పరిగణించాలి. ఈ దాడిలో రాయలసీమకు చెందిన రాజకీయ పక్షాలు భాగం కావడం దౌర్భాగ్యం.

– బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్

పిరికిపందల చర్య

రాయలసీమకు అన్యాయం చేసిన జీవోల గురించి మాట్లాడాలని అడిగిన యువకుడిపైన అనంతపురంలో స్వయం ప్రకటిత మేధావిగా చలామణీ అయ్యే చలసాని శ్రీనివాస్ ప్రోద్భలంతో దాడికి పాల్పడడం అమానవీయం. ఇది పిరికిపందల చర్య. ఇటువంటి కుట్రలో రాయలసీమకు చెందిన వామపక్ష పార్టీలు భాగం కావడం దురదృష్టకరం.

చదవండి :  తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి- కలెక్టర్

– గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాయలసీమ ఉద్యమ నేత

దాడి అమానుషం

రాయలసీమకు జరిగిన అన్యాయంపైన స్పందించాలని అడిగిన గిరిజన యువకుడిపైన అనంతపురంలో చలసాని, శివాజీల ప్రోద్భలంతో కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారు దాడికి దిగడం అమానుషం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ సోషల్ మీడియాఫోరం తరపున ఈ ఘటనకు నిరసన తెలుపుతాం.

– అశోక్, రాయలసీమ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్

దాడిని నిరసిస్తున్నాం

రాయలసీమకు ప్రభుత్వాలు చేసిన అన్యాయంపైన స్పందించాలని అడిగిన కృష్ణా నాయక్ అనే యువకుడిపైన అనంతపురంలో కొంతమంది దాడి చేయడం దుర్మార్గమైన చర్య. దీనిని నిరసిస్తున్నాం. సొంతగడ్డపైన సీమ సమస్యల గురించి మాట్లాడమని అడగటం నేరమా?

– సొదుం శ్రీకాంత్, రాయలసీమ ఎన్నారై ఫోరం కన్వీనర్

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: