అమెరికాలో సీమ వనభోజనాలకు 500 మంది

    అమెరికాలో సీమ వనభోజనాలకు 500 మంది

    (అమెరికా నుండి నరేష్ గువ్వా)

    జులై 12న ఆదివారం నాడు అమెరికాలోని కమ్మింగ్ నగరం (జార్జియా)లో నిరాహించిన రాయలసీమ వనభోజనాలు కార్యక్రమం విజయవంతమైంది. 

    వెస్ట్ బ్యాంక్ పార్కులో ఆదివారం ఉదయం  11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది ప్రవాసాంధ్రులు హాజరై సీమ రుచులను ఆస్వాదించారు.

    వనభోజనాలలో రాగిసంగటి, కోడి పులుసు (chicken gravy), పొట్టేలు సియ్యల పులుసు (Goat Curry), శనిక్కాయ కారెం (Ground nut Chutney), కూరగాయల పలావు (Vegetable Pulaav), మెంతి పప్పు, ఉల్లగడ్డల కూర (Aloo Curry), సాంబారు, శనగబ్యాళ్ళ పాయసం, ఐస్ క్రీం లతో కూడిన మెనూను అతిధులకు వడ్డించారు.

    చదవండి :  పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ - కొన్ని నిజాలు
    ragi sangati
    రాగి సంగటి తయారీ

    ఊహించిన దాని కన్నా అధికంగా జనం హాజరవడంతో నిర్వాహకులు మూడు సార్లు వంటలను చేయాల్సి వచ్చింది. కార్యక్రమానికి హాజరైనవారంతా భోజనాల తర్వాత ఆట పాటలతో, కబుర్లతో కాలక్షేపం చేశారు.

    guests

    వనభోజనాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *